అలర్ట్!
అలర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు వచ్చే మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఐఎండీ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలోని తానూరులో 43.5 డిగ్రీలు, నిజామాబాద్...