ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌కు ఎమ్మెల్యే స‌త్యం విన‌తి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563) విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భేటీలో రహదారి పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం పనులు మందగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు....