భరోసా కేంద్రాలు బాధితులకు బలమైన అండ
భరోసా కేంద్రాలు బాధితులకు బలమైన అండ అడిషనల్ డీజీపీ (సీఐడీ & ఏసీబీ) చారు సిన్హా కాకతీయ, కరీంనగర్ : లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సురక్షిత వాతావరణంలో సేవలు అందిస్తూ ‘భరోసా’ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అడిషనల్ డీజీపీ (సీఐడీ & ఏసీబీ) చారు సిన్హా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని ఆమె సందర్శించి, అక్కడి సేవలను పరిశీలించారు. కేంద్రంలోని విభాగాలను పరిశీలించిన ఆమె, సిబ్బందితో మాట్లాడి పనితీరును సమీక్షించారు. రికార్డులను పరిశీలిస్తూ రిజిస్టర్ల...