కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు
కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు కార్యాలయం అష్టదిగ్బంధనం.. అక్రమాల గుర్తింపు..?! కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీల సందర్భంగా కార్యాలయంలోని పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను అధికారులు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, పత్రాల నిర్వహణలో నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికారుల బృందం కార్యాలయంలోని...