ఘనంగా వరల్డ్ ఆర్ట్ డే వేడుకలు

ఘనంగా వరల్డ్ ఆర్ట్ డే వేడుకలు ఆర్టిస్టుల ప్రతిభకు ప్రశంసలు కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్ట్ డే వేడుకలు బుధవారం సాయంత్రం పట్టణంలోని రఘు ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ గౌడ్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటికి కనిపించే అందాలను కుంచెతో అందమైన చిత్రాలుగా మలిచే ఆర్టిస్టుల ప్రతిభ అభినందనీయమని పేర్కొన్నారు. సంగీతం, గానం వంటి కళలు ప్రజలకు...