అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ
అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ సేవల వేగం, పారదర్శకతకు ఊతం కాకతీయ, జమ్మికుంట : మండల పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం కార్యక్రమాన్ని ప్రారంభించి ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి సాంకేతిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలో వారి పాత్ర...