రాధాకృష్ణన్ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం

రాధాకృష్ణన్ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణన్ భారతదేశానికి అపార సేవలు అందించిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. రాధాకృష్ణన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు....