ఉద్యమకారుల సదస్సు విజయవంతం చేయాలి
ఉద్యమకారుల సదస్సు విజయవంతం చేయాలి ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు లింగమూర్తి కాకతీయ,చెన్నారావుపేట : ఈ నెల 18న హైదరాబాద్ తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఉప్పునూతల లింగమూర్తి పిలుపునిచ్చారు. శనివారం చెన్నారావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని...