మాంటిస్సోరిలో ఫుడ్ ఫెస్టివల్ సందడి

మాంటిస్సోరిలో ఫుడ్ ఫెస్టివల్ సందడి కాకతీయ, నెక్కొండ : నెక్కొండ మండల కేంద్రంలోని మాంటిస్సోరి హై స్కూల్‌లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ ఉత్సాహంగా నిర్వహించారు. నర్సరీ నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని పాఠశాల ఆవరణలో వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. చిన్నారులు తమ ఇళ్ల నుంచి తెచ్చిన వంటకాలను పరస్పరం పంచుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పంచుకునే భావనతో పాటు మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పాఠశాల యాజమాన్యంమాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు...