హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలి

హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలి ముక్తానంద స్వామీజీ కాకతీయ, కరీంనగర్ : హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని శ్రీశ్రీశ్రీ ముక్తానంద స్వామీజీ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌లోని బృందావన్ గార్డెన్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని, హిందువు మతతత్వవాది కాదని తెలిపారు. మతం వేరు, ధర్మం వేరు అని స్పష్టం చేశారు. హిందువుగా ధర్మం, సంస్కృతిని తెలుసుకుని ఆచరించాలని సూచించారు. కుటుంబ స్థాయిలో మార్పు కోసం మహిళలు కీలక...