జగిత్యాల సభకు గ్రామస్తుల విరాళం
జగిత్యాల సభకు గ్రామస్తుల విరాళం కాకతీయ, కరీంనగర్ / జగిత్యాల: జగిత్యాలలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ముఖ్రా(కె) గ్రామస్తులు రూ.21,000 విరాళం ప్రకటించారు. గ్రామ రైతులు తమ వంతుగా ఈ మొత్తాన్ని సేకరించి, గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులు సుఖసంతోషాలతో జీవించారని గుర్తుచేశారు. తమ గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై వారు విమర్శలు గుప్పిస్తూ, ఆరు...