ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు కాకతీయ, శంకరపట్నం : శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరవుతానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో మే 1న నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కరీంనగర్‌లో మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు....