రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న..ముగ్గురికి గాయాలు
రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న… ముగ్గురికి గాయాలు కాకతీయ / దుగ్గొండి: దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుగ్గొండి మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బాలుడిని ఊరుగొండ గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు హాస్టల్ నుంచి తీసుకెళ్తుండగా, రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నకు అడ్డంగా ఉంచిన రాళ్లు వాహనానికి తగిలి అదుపు తప్పినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్ సేవకు సమాచారం అందించారు. గాయపడిన వారిని...