కేశవపట్నంలో గోవింద నామస్మరణ
కేశవపట్నంలో గోవింద నామస్మరణ అంగరంగ వైభవంగా రథోత్సవం వేడుకలు భక్తులతో కిక్కిరిసిన గ్రామ వీధులు కాకతీయ, శంకరపట్నం : గోవింద నామస్మరణతో గ్రామం మారుమోగేలా రథోత్సవం ఘనంగా నిర్వహించామని ఆలయ అధికారులు తెలిపారు. మండలంలోని కేశవపట్నం గ్రామంలో అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ గోదా రంగనాయక స్వామి వారి రథోత్సవం వేడుకలు సోమవారం తెల్లవారుజామున నుంచే వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఆలయ అధికారులు, గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా రథం వద్దకు తరలివచ్చి...