ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి

ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి జ‌గిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ కాకతీయ, జగిత్యాల : ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో...