కాయకమే కైలాసం.. సమాజానికి మార్గదర్శకం
కాయకమే కైలాసం.. సమాజానికి మార్గదర్శకం సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహోన్నత సంస్కర్త కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కాకతీయ, కరీంనగర్: బసవేశ్వరుడు ప్రతిపాదించిన కాయకమే కైలాసం సిద్ధాంతం నేటికీ సమాజానికి మార్గదర్శకమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని సుభాష్‌నగర్‌లో జగజ్యోతి మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీరశైవ మహాసభలో ఆయన మాట్లాడుతూ...