ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం కాకతీయ, జనగామ : ప్రజావాణికి వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్షాలోమ్‌తో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకుని త్వరితగతిన...