వర్ధన్నపేట మండల బీజేపీ అధ్యక్షుడిగా అడుప రాజు
వర్ధన్నపేట మండల బీజేపీ అధ్యక్షుడిగా అడుప రాజు నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షుడు గంట రవి కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట మండల నూతన అధ్యక్షుడిగా ఇల్లంద గ్రామానికి చెందిన అడుప రాజు నియామకమయ్యారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజును శాలువాతో సన్మానించి పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అడుప...