ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ

ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం మంగళవారం భక్తుల నామస్మరణతో మారుమోగింది. హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయంలో స్వామివారిని...