మొక్కజొన్న కొనుగోళ్లలో షరతులు విధించొద్దు
మొక్కజొన్న కొనుగోళ్లలో షరతులు విధించొద్దు ఫంగస్, సన్నాల పేరుతో రైతులను వేధించడం దారుణం సాగర్ జలాలు విడుదల చేసి ఎండిపోతున్న వరిని ఆదుకోవాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు కాకతీయ, ఖమ్మం టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. మొక్కజొన్న కొనుగోళ్లలో అధికారులు పెడుతున్న నిబంధనలను తక్షణమే తొలగించాలని, ఎండిపోతున్న వరి పొలాలను కాపాడేందుకు నాగార్జున సాగర్ జలాలను విడుదల...