జేఎన్ఎస్‌లో రామప్ప ఈవెంట్స్ విజయవంతం

జేఎన్ఎస్‌లో రామప్ప ఈవెంట్స్ విజయవంతం కాకతీయ, హనుమకొండ: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా రామప్ప డిఫెన్స్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఎంపిక ఈవెంట్స్ విజయవంతమయ్యాయి. ఇంటర్మీడియట్ చదువుతో పాటు ఆర్మీ శిక్షణ పొందాలనుకునే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్ ఐలి కర్ణాకర్...