డీఎల్‌ఈడీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

డీఎల్‌ఈడీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఏజెన్సీ గిరిజన అభ్యర్థులకు సువర్ణావకాశం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ కాకతీయ, కొత్తగూడెం : 2026-28 విద్యా సంవత్సరమునకు గాను భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక గిరిజన డీఎల్‌ఈడీ కళాశాలలో ప్రవేశానికి అర్హులైన ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం తెలుగు మీడియం 12వ బ్యాచ్ రెగ్యులర్ కోర్సులో ఈ ప్రవేశాలు...