నిబంధనల మేరకే వెంచర్లకు అనుమతులు

నిబంధనల మేరకే వెంచర్లకు అనుమతులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్ : భూమి అభివృద్ధిలో భాగంగా వెంచర్ల ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో వెంచర్ ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులకు సంబంధించి భూమిని పట్టణ ప్రణాళిక అధికారి సంపత్ తో కలిసి ఆయన పరిశీలించారు. వెంచర్ల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను సరిచూడాలని...