స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం అమలు చేయాలి ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్‌కు వినతి కాకతీయ, నెల్లికుదురు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్కావెంజర్ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇసంపేల్లి సైదులు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27...