అగ్నికి ఆహుతైన 14 క్వింటాళ్ల మిర్చి
అగ్నికి ఆహుతైన 14 క్వింటాళ్ల మిర్చి గిరిజన రైతుకు రూ. 4 లక్షల నష్టం కాకతీయ, కారేపల్లి: ఆరుగాలం శ్రమించి పండించిన పంట, చేతికొచ్చే సమయంలో అగ్నిప్రమాదానికి గురై బుగ్గిపాలవడంతో ఓ గిరిజన రైతు నిట్టనిలువునా మునిగిపోయాడు. కారేపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానిక రైతాంగాన్ని కలచివేసింది. గురువారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కొండెబోయిన నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం బాధితుడిని పరామర్శించి, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసింది. మండలానికి చెందిన అజ్మీర శ్రీనివాస్ అనే గిరిజన రైతు భూమిని కౌలుకు...