మూత్రశాలలో పసిపాప..
మూత్రశాలలో పసిపాప.. బస్టాండ్‌లో వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు శిశువును రక్షించిన మహిళ, పోలీసులు కాకతీయ, వేములవాడ: కన్నపేగు కాదని అనుకున్నారో.. లేక ఆడపిల్ల అని భారంగా భావించారో గానీ, పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ పసిపాపను మూత్రశాలలో వదిలివెళ్లిన హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కొత్త బస్టాండ్‌లోని మూత్రశాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును వదిలి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. బస్టాండ్‌లోని మూత్రశాల ప్రాంతం నుంచి పసిపాప ఏడుపు వినిపించడంతో అక్కడ ఉన్న ఓ...