ఆర్టీసీ సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు

ఆర్టీసీ సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కాకతీయ, కరీంనగర్: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. గురువారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన, కార్మికులను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు....