ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు
ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు ప్రభుత్వంపై గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విమర్శలు హామీలు అమలు చేయాలని డిమాండ్ కాకతీయ, నర్సంపేట టౌన్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని...