“చదువే భవిష్యత్తు-“ప్రతి ఇంటికి విద్యా పిలుపు
“చదువే భవిష్యత్తు-“ప్రతి ఇంటికి విద్యా పిలుపు కాకతీయ, కారేపల్లి: మండల కేంద్రంలోని భజ్యతండా గ్రామపంచాయతి పరిధిలోని బొక్కలతండలో గురువారం ఎంపీపీఎస్ పాఠశాలలో బడీబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యా ప్రాధాన్యతపై గ్రామ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయితీ సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు మాట్లాడుతూ, ప్రతి పిల్లవాడూ పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని తల్లిదండ్రులను కోరారు. బాలబాలికల భవిష్యత్తు బలంగా ఉండాలంటే పాఠశాల విద్య తప్పనిసరి...