రోడ్డును మింగేసి..ఆక్రమణలు
రోడ్డును మింగేసి..ఆక్రమణలు 7వ వార్డు అక్రమ నిర్మాణాలు రాకపోకలకు స్థానికుల తీవ్ర ఇబ్బందులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని 7వ వార్డులో అక్రమ నిర్మాణాలు వెలిసి ప్రజలకు నరకం చూపుతున్నాయి. రహదారులను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో కాలనీల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వీధులు కుచించుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, ఆటోలు సైతం లోపలికి రాలేని దుస్థితి నెలకొంది. ఎవరైనా మరణిస్తే వైకుంఠ రథం రావడానికి కూడా వీలులేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల వసూళ్లలోనే...