సమ్మె ప్రభావం: రెండో రోజూ కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల కష్టాలు

సమ్మె ప్రభావం: రెండో రోజూ కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల కష్టాలు కాకతీయ, కరీంనగర్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకి చేరడంతో కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు మరింత పెరిగాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లోనే వేచి చూస్తూ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం బయలుదేరినవారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమ్మె కారణంగా పలు రూట్లలో బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆందోళన చెందుతున్నారు. కొందరు...