పోయిన ఫోన్లు తిరిగి అందజేసిన ముదిగొండ పోలీసులు
పోయిన ఫోన్లు తిరిగి అందజేసిన ముదిగొండ పోలీసులు కాకతీయ, ముదిగొండ, : ముదిగొండ మండల కేంద్రానికి వివిధ ప్రాంతాల నుండి పనుల నిమిత్తం వచ్చిన నలుగురు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేయగా, ముదిగొండ పోలీసులు చురుకుగా స్పందించి వాటిని రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ముదిగొండకు చెందిన శివరాత్రి రామయ్య, పిప్పలల కృష్ణ, నేలకొండపల్లికి చెందిన రాజపుత్ర సాయి, ఆలకుంట నవీన్ తమ మొబైల్ ఫోన్లు కోల్పోయినట్లు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు సీఐఇఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం సాంకేతిక...