బాధిత కుటుంబాలకు ఎర్రబెల్లి పరామర్శ
బాధిత కుటుంబాలకు ఎర్రబెల్లి పరామర్శ కాకతీయ, రాయపర్తి: మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పరామర్శించారు. మండలంలో పర్యటించిన ఆయన.. బంధనపల్లిలో గుగులోత్ కేలి, సన్నూరులో కోతి వెంకటేశ్వర్లు, వాంకుడోత్ తండాలో కునుసోత్ పాండు నాయక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా...