మట్టి మాఫియాపై ‘రెవెన్యూ’ పంజా!

మట్టి మాఫియాపై ‘రెవెన్యూ’ పంజా! కూసుమంచిలో అక్రమ తవ్వకాలపై అధికారుల మెరుపు దాడులు 8 ట్రాక్టర్లు, ఒక జేసీబీ స్వాధీనం.. స్టేషన్‌కు తరలింపు దాడులు కొనసాగాలని కోరుతున్న మండల ప్రజలు కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలంలో ఇన్నాళ్లూ యథేచ్ఛగా సాగిన మట్టి మాఫియా ఆగడాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులపై రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా విరుచుకుపడింది. గురువారం మండలంలోని గురువాయిగూడెంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు, ఎస్ఐ...