ఆర్టీసీ సమ్మె శాంతియుతంగా సాగాలి…అల్లర్లకు తావిస్తే కఠిన చర్యలు
ఆర్టీసీ సమ్మె శాంతియుతంగా సాగాలి...అల్లర్లకు తావిస్తే కఠిన చర్యలు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కరీంనగర్ : కరీంనగర్‌లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సమ్మె ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే జరగాలని స్పష్టం చేశారు. ప్రజా అశాంతి సృష్టించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమ్మె కారణంగా సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు...