నేరడలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
నేరడలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన హాజరైన మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కాకతీయ, చింతకాని : చింతకాని మండల పరిధిలోని నేరడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామ చంద్రస్వామి, వేణుగోపాలస్వామి, వేంకటేశ్వరస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఆలయ...