బొల్లికుంటలో విగ్రహ రాజకీయం: శివాజీ, అంబేద్కర్ వర్గాల మధ్య ఉద్రిక్తత
బొల్లికుంటలో విగ్రహ రాజకీయం: శివాజీ, అంబేద్కర్ వర్గాల మధ్య ఉద్రిక్తత వీడని పట్టు.. కొనసాగుతున్న ధర్నాలు రంగంలోకి పోలీస్, రెవిన్యూ యంత్రాంగం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల పరిధిలోని బొల్లికుంట గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అసలేం జరిగిందంటే..? గ్రామంలోని శివాజీ యూత్ సభ్యులు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి...