నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత డ్రైవర్ ఆత్మహత్యాయత్నం! కాకతీయ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ ఒక డ్రైవర్ అందరూ చూస్తుండగానే ఒంటికి నిప్పంటించుకోవడం కలకలం రేపింది. గురువారం తమ డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డిపో కార్మికులు సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం డిపో గేటు ముందు భారీ...