అంగన్‌వాడీల్లో ‘పోషణ పక్షం’ ముగింపు
అంగన్‌వాడీల్లో ‘పోషణ పక్షం’ ముగింపు సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఇన్‌చార్జి సీడీపీఓ శ్రీలత కాకతీయ, శంకరపట్నం: మండలంలోని మొలంగూర్-2, రాజాపూర్ అంగన్‌వాడీ కేంద్రాల్లో గురువారం ‘పోషణ పక్షం’ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సూపర్‌వైజర్ పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ఇన్‌చార్జి సీడీపీఓ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం అత్యంత ఆవశ్యకమని ఆమె పేర్కొన్నారు. నిత్యం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలని తల్లులకు సూచించారు. అనంతరం ఆమె...