ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ వేయాలి
ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ వేయాలి టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్కటి సంజీవ్ రెడ్డి కాకతీయ, జమ్మికుంట: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమ ఫోరం (టీయూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్కటి సంజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంటలోని శంకరనందన్ గార్డెన్‌లో నిర్వహించిన హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఎఫ్‌ఐఆర్ నమోదైన వారితో పాటు, వివిధ రీతుల్లో సేవలందించిన వారిని...