నల్లబెల్లం నిల్వలపై ఎక్సైజ్ దాడులు

నల్లబెల్లం నిల్వలపై ఎక్సైజ్ దాడులు గుడుంబా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నేలకొండపల్లి మండలంలో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు కాకతీయ, కూసుమంచి: నేలకొండపల్లి మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లంపై ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మండలంలోని కోనాయగూడెం, శంకర్ గిరితండా గ్రామాల్లో నల్లబెల్లం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో ఖమ్మం జిల్లా టాస్క్ ఫోర్స్ (డిటిఎఫ్), నేలకొండపల్లి ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. కోనాయగూడెం గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి శ్రీనివాస్ తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లాన్ని అధికారులు గుర్తించారు....