ముదిగొండలో అడ్డగోలుగా గ్రానైట్ రవాణా

ముదిగొండలో అడ్డగోలుగా గ్రానైట్ రవాణా రహదారులపై రాళ్ల వేస్టేజీ.. ప్రాణాపాయంలో వాహనదారులు పట్టించుకోని అధికార యంత్రాంగం కాకతీయ, ముదిగొండ: ముదిగొండ మండలంలో గ్రానైట్ రాళ్ల రవాణా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. పాతబడిన వాహనాల్లో భారీ రాళ్లను అడ్డగోలుగా తరలిస్తుండటంతో, అవి రహదారులపై పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ రవాణా వల్ల ఒకవైపు విలువైన గ్రానైట్ వృథా అవుతుండగా, మరోవైపు సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారుతున్నాయి. రవాణా సమయంలో వాహనాల నుంచి జారి రోడ్డు మధ్యలో పడిపోతున్న...