సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్ కన్నుమూత

సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్ కన్నుమూత కాకతీయ, హుజూరాబాద్: హుజూరాబాద్ మండలం చెల్పూరు గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్ (54) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలియగానే హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లోని పాత్రికేయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 'చురకలు' పత్రికతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీనివాస్, 'సాక్షి' దినపత్రికలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇటీవల సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ జర్నలిజంలో కొనసాగుతున్నారు. శ్రీనివాస్ జీవితంలో ఒక విషాదకర యాదృచ్ఛికం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం జమ్మికుంటకు వెళ్తుండగా ఒక...