ఏం పాపం చేశావామ్మా…!!
ఏం పాపం చేశావామ్మా...!! శ్మశాన వాటికలో ఆరు నెలల పసి పిండం వదిలివేత స్థానికులను కంటతడి పెట్టించిన హృదయ విదారక ఘటన కాకతీయ, మణుగూరు టౌన్: కన్నప్రేమ కఠినమైంది.. పేగుబంధం తెగిపడింది. కన్నవారే తమ రక్తాన్ని పంచుకు పుట్టిన పసికందుల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్న ఘటనలు నిత్యం కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా అభం శుభం తెలియని ఆరు నెలల పసి పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శ్మశాన వాటికలో వదిలి వెళ్లిన అమానవీయ ఘటన మణుగూరు మండలంలో వెలుగుచూసింది. గుట్ట మల్లారం...