అమరుల స్ఫూర్తితో ఉద్యమాలకు ఊపిరి
అమరుల స్ఫూర్తితో ఉద్యమాలకు ఊపిరి ఘనంగా సంస్మరణ వారోత్సవాలు బూర్గుపల్లి లక్ష్మయ్య, మంగిశెట్టి సాయిలు స్థూపాల వద్ద నివాళి కాకతీయ, నెక్కొండ: అమరుల ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఎంసీపీఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకు నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నెక్కొండ మండల కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మండల కార్యదర్శి గాజుల వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో...