కలెక్టర్ దివాకర్ బదిలీపై పునరాలోచించాలి
కలెక్టర్ దివాకర్ బదిలీపై పునరాలోచించాలి గిరిజనాభివృద్ధికి విఘాతం కలగకుండా చూడాలి ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుం దెబ్బ' డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్.దివాకర్ గారిని బదిలీ చేయడంపై గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిని మార్చడం వల్ల జరుగుతున్న ప్రగతికి అంతరాయం కలుగుతుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి పేర్కొన్నారు. శనివారం ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో...