విద్యుదాఘాతంతో మొక్కజొన్న దగ్ధం

విద్యుదాఘాతంతో మొక్కజొన్న దగ్ధం గుంపెల్లగూడెంలో ఏడు ఎకరాల్లో తగలబడిన‌ పంట తట్టుకోలేక కుప్పకూలిన రైతు వీరన్న కాకతీయ, కారేపల్లి: కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఇద్దరు రైతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. సింగరేణి మండలం గుంపెల్లగూడెం గ్రామ పరిధిలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు ఏడు ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా బూడిదైంది. కళ్లముందే చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు గుండెనిరవిలా రోదిస్తున్నారు. గ్రామ సమీపంలోని పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గుగులోత్ వీరన్నకు చెందిన...