మేడే స్ఫూర్తితో హక్కుల పోరాటం
మేడే స్ఫూర్తితో హక్కుల పోరాటం నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు కాకతీయ, నర్సంపేట టౌన్: కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమాలను ఉధృతం చేయాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఆదివారం హమాలీ కార్మికుల సమావేశం...