బావిలో పడి వివాహిత మృతి

బావిలో పడి వివాహిత మృతి దేవరుప్పుల మండలం కొలుకొండలో విషాదం కాకతీయ, దేవరుప్పుల : మండలంలోని కొలుకొండ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన సమయంలో నీరు తాగేందుకు బావి వద్దకు వెళ్లి కాలుజారి పడటంతో ఈ విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పన్నీరు వైదేహి (25) ఎనిమిదేళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆదివారం ఉదయం వైదేహి తన భర్తతో కలిసి గ్రామ...