మామిడిగూడెంలో ‘బృహత్ శిలాయుగ’ సమాధులు!

మామిడిగూడెంలో ‘బృహత్ శిలాయుగ’ సమాధులు! వెలుగులోకి అరుదైన నిర్మాణాలు వందలాది డాల్మెన్ సమాధులు.. మానవాకృత శిల్పాలు చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తున్న ‘తెలంగాణ డిస్కవరీ టీం’ పరిశోధన కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మామిడిగూడెం పరిధిలోని గుట్టలు అద్భుత చారిత్రక రహస్యానికి వేదికయ్యాయి. తెలంగాణలోనే ఇప్పటివరకు కనిపింనంత అతిపెద్ద ‘బృహత్ శిలాయుగం’ నాటి శ్మ‌శాన వాటికను ‘తెలంగాణ డిస్కవరీ టీం’ ఆదివారం వెలుగులోకి తెచ్చింది. ఇక్కడి అరుదైన నిర్మాణాలు యావత్ భారతదేశ చరిత్రకారులను ఆకర్షిస్తాయని డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి...